అమరావతి : ఎంతో కష్టపడి వైద్య విద్య ( Medical Student )లో అవకాశం దొరికిన విద్యార్థి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన విషాద ఘటన వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మోహన్ విద్యార్థి అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ( MBBS ) చదువుతున్నాడు. అతడు ఐదుగురు మిత్రులతో కలిసి స్విమ్మింగ్పూల్లో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్లో పడి వైద్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.