ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత బండారి తమకొద్దు అంటూ బిచ్కుంద పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని ప్రిన్సిపాల్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- మా పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు..
- బిచ్కుంద మైనార్టీ గురుకుల విద్యార్థుల ఆందోళన
బిచ్కుంద, అక్టోబర్ 13: తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత బండారి తమకొద్దు అంటూ బిచ్కుంద పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని ప్రిన్సిపాల్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భోజనం విషయంలో ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే తమను టార్గెట్ చేసి దుర్భాషలాడుతున్నారని వాపోయారు. ఆమె గత నెలలో ఇదే తరహాలో వ్యవహరిస్తే సబ్ కలెక్టర్ కిరణ్మయి పాఠశాలను సందర్శించి చెప్పినా ప్రిన్సిపాల్ తీరు మారడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారులకు చెప్పి పరిష్కరించుకోవాలని సూచించి పంపించారు.
అధైర్య పడకండి.. అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
విద్యార్థుల ఆందోళన చేస్తుండగా అటువైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గమనించి వారితో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. కాస్మొటిక్స్ ఇవ్వంలేదని, తరగతి గదిలోనే చదువుకోవడంతో పాటు అదే గదిలో నిద్రించడంతో ఇబ్బందులు పడుతున్నామని, కనీస వసతులు కూడా లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క గురుకుల పాఠశాల విద్యార్థి రోడ్ల పైకి వచ్చి ధర్నా చేయలేదని షిండే గుర్తుచేశారు. గురుకుల పాఠశాలలో ఏ ఒక్క సమస్య రాకుండా చూసుకున్నామన్నారు. అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లిపోయారు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

