వేటగాడి చరిత్రలో…
జయాపజయాలతో సంబంధం లేకుండా వినూత్న కథల్ని ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు యువ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వినూత్న కథల్ని ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు యువ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. నితాన్షీ గోయెల్ కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్ ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇందులో ఆనంద్ దేవరకొండ చేతిలో తుపాకి పట్టుకొని ఆగ్రహంగా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఆనంద్ దేవరకొండ కెరీర్లో విభిన్న చిత్రమవుతుందని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

