‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడ సారపాక ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సంప్రదాయ జానపద కళ కోలాటానికి విశేష సేవలందిస్తూ కళావైభవాన్ని...
– సారపాక కోలాట కళాకారులకు అరుదైన గౌరవం
బూర్గంపహాడ్, అక్టోబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడ సారపాక ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సంప్రదాయ జానపద కళ కోలాటానికి విశేష సేవలందిస్తూ కళావైభవాన్ని చాటుతున్న ఈ బృందానికి బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘భారతీయ కోలాట కళారత్న’ జాతీయ పురస్కారం-2026 నవంబర్ 15న దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రధానం చేయనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కార్యాలయంలో అంతర్జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా ఎంపిక పత్రాలను కోలాట బృందం అందుకుంది. అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ప్రదర్శనకు శ్రీకృష్ణం వందే జగద్గురుం టీంను ఎంపిక చేసినట్లు తెలిపారు. 28 రాష్ట్రాల కళాకారులు 8 దేశాల ప్రజాప్రతినిధులు పాల్గొనే ఇంతటి మహత్తర కార్యక్రమంలో కోలాట కళకు వన్నెతెచ్చి జాతీయ పురస్కారానికి ఎంపికైన | శ్రీకృష్ణం వందే జగద్గురుం బృందం గురువు తోకల రమేష్, కోలాట కళాకారులను పలువురు అభినందిస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

