AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
AP News | ఏపీలోని కూటమి సర్కారుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, వైసీపీ పార్టీలు దాష్టీక రాజకీయాలు చేస్తూ.. రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నాయని ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను మరో ‘సౌత్ బీహార్’గా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
AP News : ఏపీలోని కూటమి సర్కారుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, వైసీపీ పార్టీలు దాష్టీక రాజకీయాలు చేస్తూ.. రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నాయని ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను మరో ‘సౌత్ బీహార్’గా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాయచోటి, పుంగనూరులో జరిగిన ఘర్షణలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఆందోళనకర పరిణామాలని షర్మిల అన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను ఘర్షణలు, దాడులతో రణరంగంగా మారుస్తున్నారని విమర్శించారు. ‘కూటమిది నిజంగా పవిత్ర పాలనే అయితే దాడులు ఎందుకు..? బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు..? నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమెందుకు..?’ అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
అప్పుడు వైసీపీ హయాంలో హింసాకాండ జరిగితే ఇప్పుడు టీడీపీ హయాంలో అంతకుమించిన ఘోరాలు జరుగుతున్నాయని షర్మిల అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని, శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని నిలదీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ సాగిస్తున్న ఈ దౌర్జన్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

