AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
AP News | ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Local Body Elections) కూటమి నాయకులు ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. సొంత పార్టీలకు చెందిన నాయకులే తిరుగుబాటు ఎగురువేయడం ఆ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ( Tiruvuru ) మున్సిపల్ చైర్మన్ స్థానం పొత్తులో భాగంగా జనసేన కు కేటాయించారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ మాదవి పేరును ప్రకటించారు.
అయితే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్( MLA Kolikapudi Srinivas ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ సొంతగా నాగ శ్రావణి పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించు కున్నారు. ఆదివారం నామినేషన్ వేసే కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో సంచలనం సృష్టించింది.
సాలూరు మున్సిపల్ అభ్యర్థి ఎంపికపై కూటమిలో అసంతృప్తి నెలకొంది. ఇక్కడ కూడా జనసేనకు కేటాయించడం, వైసీపీ అభ్యర్థికి జనసేన సీటు ఇచ్చారంటూ కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన కార్యకర్తలు రాజీనామా లకు సిద్ధపడ్డారు. వైసీపీకి రాజీనామా చేయకుండా జనసేన టికెట్ కేటాయించడం పట్ల జనసైనికులు మండిపడుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

