Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాపిడో బైక్ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాపిడో డ్రైవర్, ఆ బైక్పై ప్రయాణిస్తున్న డాక్టర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.