Drinking Water | సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కొండాపూర్ నుంచి గోడకొండ్ల వరకు ఉన్న మంచినీట సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, పంపింగ్ మెయిన్ 2375 ఎంఎం డయా పైప్‌లైన్‌కు లీకేజీ పడింది. దీన్ని అరికట్టేందుకు ఎయిర్ వాల్వ్, గేట్ వాల్వ్, పనిచేయని వాల్వ్‌లను మార్చేందుకు మరమ్మ తులు చేపట్టనున్నారు. ఈ పనులు ఈనెల 13 ఉదయం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు సాగనున్నాయి. దీంతో కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3 రింగ్ మెయిన్-1 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది.
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, ప్రశాసన్ నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్‌పేట, హకీంపేట, కార్వాన్, మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌ స్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నెంబర్, కిస్మత్‌పురా, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రి పురం, అల్లబండ, మధుబస్, ధర్మసాయి(శంషాబాద్); సాహెబ్‌నగర్, ఆటోనగర్, సురూర్నగర్, వాసవి నగర్, నాగోల్, ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి, భరత్‌నగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల, మానిక్‌చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది.