Sree Vishnu | సినిమా ఇండస్ట్రీలో కథల విషయంలో ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం. ఒక హీరో వద్దన్న కథ మరో హీరోకి వన్ మాన్ షోగా మారడం, రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా మారడం పరిపాటే. తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘సింగిల్’ అనే సినిమాకు కూడా ఇలాంటి కథే ఉంది. ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు ఒప్పుకొని సూపర్ హిట్ కొట్టాడు. కానీ, ఈ సినిమా కథను మొదట 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారట.ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ..ఈ కథను దర్శకుడు కార్తీక్ రాజు మూడేళ్ల క్రితమే నాకు చెప్పారు.
కానీ ఈ కథను తనకు ముందు 15 మంది హీరోల దగ్గరకు తీసుకెళ్లారట. వాళ్లంతా రిజెక్ట్ చేశారు. వాళ్లు రిజెక్ట్ చేయడం వల్లే నాకే అవకాశం వచ్చింది. అందుకే వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా!” అని చమత్కరంగా చెప్పారు. గీతా ఆర్ట్స్ & కాల్య ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా ‘సింగిల్’. యూత్ అండ్ కామెడీ అంశాలతో ట్రెండీగా తెరకెక్కింది. శ్రీవిష్ణుకు జోడీగా కేతిక శర్మ, ఇవానా నటించగా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌కి యువత నుంచి మంచి స్పందన వచ్చింది. పాజిటివ్ టాక్‌తో పాటు, ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు అందించింది.
ఇండస్ట్రీలో చాలా మంది ప్రామిసింగ్ యాక్టర్లు ఈ కథను తిరస్కరించినట్టు టాక్. కానీ, ఆ అవకాశం చివరికి శ్రీవిష్ణు దక్కించుకోవడం, ఆయన నమ్మకాన్ని సినిమా నిజం చేయడం ఇదొక రేర్ ఫృట్. ఈ కథపై చాలా మంది డౌట్ వ్యక్తం చేసినా, శ్రీవిష్ణు నమ్మకంతో ముందుకు వెళ్లడం ఫలితంగా మంచి విజయం దక్కింది. ప్రస్తుతం శ్రీవిష్ణు రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. మృత్యుంజయ – ఫాంటసీ & థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రెండోది కామ్రేడ్ కళ్యాణ్ – రాజకీయ టచ్ ఉన్న కథతో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ రెండు సినిమాలు కూడా విభిన్న కథాంశాలతో రూపొందుతుండటంతో, శ్రీవిష్ణు కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.