Hyderabad | హైదరాబాద్ : నగర శివార్లలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి థార్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును థార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ కారు నుజ్జు నుజ్జు అయింది. బైక్ కూడా పూర్తిగా ముక్కలైపోయింది. బైక్పై ప్రయాణిస్తున్న విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు యజమాని అనిరుధ్, డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు హస్తినాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు కూడా ఆస్పత్రిలో చేరారు. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.