కొడంగల్, మార్చి 13 : మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి కాంట్రాక్టర్‌కు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు ప్రారంభమై చాలా కాలం కావస్తుందని, ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉందని ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాల యానికి వెళ్లే ప్రధాన రహదారి పనులు నేటి వరకు జరుగుతూనే ఉన్నాయని, మరో 15రోజుల్లో జాతర ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
పనులు ఇలాగే కొనసాగితే ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతాయని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలను పరిశీలించారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డ్‌లో రూ.42లక్షలో నిర్మిస్తున్న దుకాణ సముదాయ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్‌తోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆటల్లో గెలుపోటములు సహజం
బొంరాస్‌పేట,మార్చి 13 : ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అల్లికాన్పల్లిలో 15రోజులపాటు నిర్వహిస్తున్న కొడంగల్ తాలూకా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ ఎల్లప్ప, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, తాలూకా యూత్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, పార్టీ నాయకుడు బసిరెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు.