షాద్‌నగర్, మార్చి13 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, షాద్‌నగర్, చేగూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ కష్టం రానివ్వకుండా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పంట కొనుగోలు విషయంలో ఎలాంటి అక్రమాలు జరుగకుండ కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
దైవ చింతన అలవర్చుకోవాలి
నందిగామ : మామిడిపల్లి గ్రామంలో గ్రామస్తులు మల్ల న్న స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నవీన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.