పాల్వంచ, మార్చి 18 : తాండ్ర నారాయణ రావు ట్రస్ట్ పాల్వంచ, చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరావు (అమెరికా) ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సుమారు 3 వేల పేద ముస్లిం కుటుంబాలకు రూ.30 లక్షల విలువ చేసే 14 రకాల నిత్యావసర ఆహార పదార్థాలతో కూడిన రంజాన్ తోఫా కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలో పంపిణీ చేసినట్లు టీఎన్ఆర్ ట్రస్ట్ కార్యదర్శి నరాటి ప్రసాద్, సలహాదారులు తాండ్ర లక్ష్మణ్ రావు, ఇనుగంటి రాము, తాండ్ర నాగబాబు, కోడుమూరు పుల్లారావు తెలిపారు. పాల్వంచ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో స్థానిక కార్పొరేట్ల సమక్షంలో రంజాన్ తోఫాను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
వీటితో పాటు గతంలో TNR ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకి రూ.35 లక్షలతో అధునాతన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, పాల్వంచ ములకలపల్లి హాస్పటల్ కి రూ.20 లక్షలతో 108 అంబులెన్స్, కెపి జగన్నాధపురం హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్, హమాలీ కాలనీ, వనమా కాలనీలో మంచినీటి బోర్స్ ఏర్పాటు, పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్ధికంగా చేయూత, ములకలపల్లి మండలంలో పేద రైతులకు బీడు భూములు వెయ్యి ఎకరాల సాగు నీరు కోసం రూ.50 లక్షలతో విద్యుత్ సరఫరాకి ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.