నల్లబెల్లి,జులై 07 : కొమురయ్య జీవితం కార్మిక వర్గానికి అంకితం అని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. కార్మిక హక్కుల కోసం నిరంతరం పరితపించిన కార్మిక ఉద్యమ నాయకుడు గుండెబోయిన కొమురయ్య సంతాప సభ బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అధ్యక్షతన నర్సంపేట పట్టణ కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అనేక సమ్మెలు, పోరాటాలు నిర్వహించిన కొమురయ్య జీవితం ఈ తరం కార్మిక నాయకులకు ఆదర్శమన్నారు.
ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు కార్మిక వర్గ హక్కుల పై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టడమే నిజమైన నివాళులు అన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.] రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటల పని విధానం తీసుకురావడానికి జీవో నెంబర్ రెండును తీసుకోవచ్చిందని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడేం మల్లేశం, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అమాలి శ్రీనివాస్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరు లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ గుంపల్లి మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సిఐటియు జిల్లా నాయకులు హనుమకొండ శ్రీధర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెళ్లి రమేష్, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి వెన్నముద్దల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, రిక్షా యూనియన్ గౌరవాధ్యక్షులు మేడిద శ్రీనివాస్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సభ్యులు గడ్డం సమ్మయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు రుద్రారపు పైడయ్య, హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడిచెర్ల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, గాండ్ల రాములు మంద మల్లయ్య,జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.