కోల్ సిటీ, జనవరి 21: రామగుండం నగర పాలక సంస్థ ఆడిషనల్ కమిషనర్ ఏ. మారుతీ ప్రసాద్‌కు పదోన్నతి లభించింది. ఈమేరకు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీకి కమిషనర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. బుధవారం ప్రభుత్వ కార్యదర్శి డా.టీ.కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కమిషనర్ల బదిలీ ప్రక్రియలో భాగంగా రామగుండం కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా ఉన్న మారతీ ప్రసాద్ బదిలీ అయ్యారు.
మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమిషనర్ల ఆకస్మిక బదిలీలపై చర్చ జరుగుతోంది. నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే. అరుణ శ్రీ బదిలీ అవుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇటీవలనే అడిషనల్ కమిషనర్ గా వచ్చిన మారుతీ ప్రసాద్ ను బదిలీ చేశారు. దీంతో ఇన్చార్జి కమిషనర్ గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మరికొద్ది రోజుల పాటు ఇక్కడే విధుల్లో కొనసాగనున్నట్లు తేలిపోయింది.