Peddi | ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్లో టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) నటిస్తోన్న చిత్రం పెద్ది (Peddi). పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
పెద్ది షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం నైట్ (రాత్రిపూట) షూటింగ్ కొనసాగుతుంది. రామోజీఫిలింసిటీలో రాంచరణ్ అండ్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఈ షెడ్యూల్లో జాన్వీకపూర్, రాంచరణ్‌పై వచ్చే పాటను కూడా షూట్ చేయనున్నారట. త్వరలోనే షూటింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.
పెద్ది మార్చి 27న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వధ్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఉప్పెన డైరెక్టర్‌తో ఈ సారి ఎలాగైనా మంచి హిట్టుకొట్టాలని చూస్తున్నాడు.
Nalgonda : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
YS Jagan | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ యాప్.. వాళ్లందరికీ సినిమా చూపిస్తానని వైఎస్ జగన్ వార్నింగ్
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ