Vajpayee | మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయీకి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వాజ్‌పేయీకి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు.
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వాజ్‌పేయీకి ఊహించని అనుభవం ఎదురైనట్లు చెప్పారు. ఆ పర్యటనలో వాజ్‌పేయీ ప్రసంగానికి ఆకర్షితురాలైన ఓ మహిళ (Pak Woman) మాజీ ప్రధానికి ఓ ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. అయితే, వాజ్‌పేయీ సమాధానం ఆమె నోరు మూయించిందని వివరించారు. ‘ఓసారి వాజ్‌పేయీ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ మాజీ ప్రధాని స్పీచ్‌కు అట్రాక్ట్ అయిన ఓ మహిళ.. వెంటనే వాజ్‌పేయీ వద్దకు వచ్చి ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?’ అని అడిగింది. దానికి వాజ్‌పేయీ ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. కానీ కట్నం కింద పాకిస్థాన్ కావాలి’ అని అడిగారు’ అని రాజ్‌నాథ్ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
Also Read..
Pune Polls | మాకు ఓటేస్తే.. థాయ్‌లాండ్ ట్రిప్, బంగారం, ఎస్యూవీ : ఓటర్లకు అభ్యర్థుల ఎన్నికల హామీలు
Congress MLA | వరుస విద్యుత్ కోతలతో విసుగెత్తి.. అధికారుల ఇంటికి కరెంట్ కట్ చేసిన ఎమ్మెల్యే
DK Shivakumar | పదవుల కంటే పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇష్టం : డీకే శివకుమార్