Immanuel | జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ ఫేమస్ అయిన కమెడీయన్ ఇమ్మాన్యుయేల్. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఒక దశలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన ఇమ్మూ చివరకు నాలుగో ప్లేస్‌కే పరిమితమవ్వడంతో అతని అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టీవీ షోలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌తో బిజీ అవ్వడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలోనూ ఇమ్మూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం తన ప్రియురాలిని పరిచయం చేస్తూ చేసిన పోస్టులు అప్పట్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసి మరోసారి వార్తల్లోకి వచ్చాడు ఈ జబర్దస్త్ కమెడియన్. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘వేస్ట్ అమ్మా’ అంటూ ప్రేమగా పిలుచుకునే తన ప్రియురాలిపై భావోద్వేగాలతో కూడిన క్యాప్షన్ రాశాడు. తన జీవితంలోకి వచ్చినందుకు, తనను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతూ, గతంలో తాను ఆమెను బాధపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ ఏడాది నుంచి ఇద్దరం ఇంకా స్ట్రాంగ్‌గా ఉండి జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానని, ఇకపై ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నానని ఇమ్మూ చెప్పాడు.
అడగకుండానే దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి ఆమెనేనని, తన జీవితంలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. ఎల్లప్పుడూ తనకు అండగా నిలబడి అపారమైన ప్రేమను పంచినందుకు థ్యాంక్యూ సో మచ్ అంటూ ప్రేమను కురిపించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టును బట్టి ఇమ్మూ గర్ల్‌ఫ్రెండ్ పేరు రుచి అని తెలుస్తుండగా, షేర్ చేసిన ఫొటోలో ఆమె ముఖాన్ని దాచడం అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది. దీంతో వదినను ఎప్పుడు చూపిస్తావ్ అంటూ కామెంట్స్ రావడంతో, త్వరలోనే చూపిస్తానని ఇమ్మాన్యుయేల్ రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.