Pune Polls | సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఓటర్ల (Voters)ను ఆకర్షించేందుకు పలు పథకాలు, బహుమతులు, హామీలూ ప్రకటిస్తుంటారు. తాజాగా పూణె మున్సిపల్ ఎన్నికలు (Pune Polls) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకు కారణంగా అక్కడి ఓటర్లకు అభ్యర్థులు ఇచ్చిన హామీలే. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఖరీదైన కానుకలను ప్రకటిస్తున్నారు. విదేశీ ట్రిప్పులు, బంగారు ఆభరణాలు, లగ్జరీ కార్లు వంటి ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పూణె మున్సిపల్ ఎన్నికలకు మరో మూడు వారాల సమయం ఉంది. అధికారం కోసం పోటీ పడుతున్న కౌన్సిలర్లు ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు ఇస్తున్నారు. లోహ్గావ్-ధనోరి వార్డులో ఓ అభ్యర్థి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రా ద్వారా 11 మంది ఓటర్లకు ఒక్కొక్కరికి 1,100 చదరపు అడుగుల భూమిని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది.
ఇక విమన్ నగర్లో అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి ఓటర్లకు విదేశీ ట్రిప్పును ప్రకటించారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే ఐదు రోజులపాటూ థాయ్‌లాండ్‌కు లగ్జరీ టూర్‌ను (Thailand Trip) అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక మరికొన్ని చోట్ల లక్కీ డ్రా ద్వారా ఖరీదైన ఎస్యూవీ కార్లు, ద్విచక్ర వాహనాలు, మహిళా ఓటర్లకు పైథానీ, పట్టు చీరలు, బంగారు, వెండి ఆభరణాలు వంటి హామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ఇప్పటికే బహుమతులను కూడా అందించినట్టు తెలుస్తోంది. కొందరు కుట్టు మెషీన్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఇక క్రీడా ఔత్సాహిక ఓటర్ల కోసం రూ.లక్ష నగదు బహుమతితో క్రికెట్ లీగ్‌లు ఏర్పాటు చేశారు.
Also Read..
Ganesh Uike | ఒడిశా ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కీలక నేత గణేశ్ ఉయికే..!
Congress MLA | వరుస విద్యుత్ కోతలతో విసుగెత్తి.. అధికారుల ఇంటికి కరెంట్ కట్ చేసిన ఎమ్మెల్యే
DK Shivakumar | పదవుల కంటే పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇష్టం : డీకే శివకుమార్