Rajinikanth | హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి (Holi Celebrations). దేశవ్యాప్తంగా ప్రజలు సోమవారం నాడు రంగుల పండుగను సందడిగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకుంటూ సందడి చేశారు. ఇక సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా తన కుటుంబంతో ఈ వేడుకలను జరుపుకున్నారు.
చెన్నై (Chennai)లోని పోయస్ గార్డెన్ (Poes Garden)లోగల తన నివాసంలో భార్య లతా, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి హోలీలో పాల్గొన్నారు. అంతా రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపారు. ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ను రజినీ కూతుళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ (Rajinikanth) జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 %కి పైగా ఈ సినిమా కంప్లీట్ కూడా చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj)తో తలైవా 171 (Thalaivar 171) ప్రాజెక్ట్ చేయనున్నాడు.
Also Read..
Delhi Metro | ఆప్ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేసిన అధికారులు
Islamabad | పాక్ రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌పై ఉగ్రదాడి.. వారం వ్యవధిలోనే రెండో అటాక్
Jaggi Vasudev | ఆసుపత్రి బెడ్‌పై పేపర్ చదువుతూ.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు