పరిగి, నవంబర్ 21 : రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గానికి ఒక బంజారా భవన్ల నిర్మాణానికి ఒక ఎకరం చొప్పున స్థలం కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్‌నాయక్, ఉపాధ్యక్షుడు గోవింద్‌నాయక్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు.
ఈ మేరకు శుక్రవారం వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు. బంజారా భవన్ల నిర్మాణానికి భూమితో పాటు నిధులు మంజూరు చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొర్ర పాండునాయక్, సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.