Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Rahul Gandhi : సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ ప్రణాళికపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో హై టీ ఏర్పాటు చేశారు.
Rahul Gandhi : సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ ప్రణాళికపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో హై టీ ఏర్పాటు చేశారు. ఇండియా బ్లాక్ కూటమి పార్టీలతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఈ హై టీ మీటింగ్‌కు హాజరయ్యాయి. వోట్ చోరీ అంశం, సీఈసీ రాజీనామా అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతోపాటు, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ప్రజా ఉద్యమంలో ఈ సమావేశం ఒక భాగమని రాహుల్ అన్నారు. ఈ ఉద్యమాన్ని కొనసాగించేందుకు భాగస్వాములంతా ఏకమయ్యారు అని ఆయన తెలిపారు. టీ తర్వాత ఈ అంశంపై మీడియాతో తామంతా మాట్లాడుతామని రాహుల్ వెల్లడించారు.
అందరూ కలిసి సంఘటితంగా, సమన్వయంతో ఉద్యమం చేయడం, వ్యూహాత్మకంగా ఆందోళన నిర్వహించడం వంటివి ప్రధాన అంశాలుగా హైటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు కూడా ఈ సమావేశం ఒక వేదికగా నిలిచింది. సీఈసీ రాజీనామా కోరుతూ ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు సోమవారం సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌ను మరింత ఉధృతం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం వీలైనంత అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. చివరకు నిరసన జరిగే జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EC
- High tea
- INDIA bloc
- Rahul Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

