రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
సింగరేణి కార్మిక కుటుంబాలకు మంచినీరు అందించే ఫిల్టర్ బెడ్లో రిటర్నింగ్ వాల్‌ను మూసివేయడంతో కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఫిల్టర్ బెడ్లో క్లీనింగ్ పనులు చేసే కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే వివాదానికి కారణమా? కార్మిక కుటుంబాలకు తాగునీటి సరఫరాను అడ్డుకునే పరిస్థితి...
రుద్రంపూర్, అక్టోబర్ 13 : సింగరేణి కార్మిక కుటుంబాలకు మంచినీరు అందించే ఫిల్టర్ బెడ్లో రిటర్నింగ్ వాల్‌ను మూసివేయడంతో కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఫిల్టర్ బెడ్లో క్లీనింగ్ పనులు చేసే కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే వివాదానికి కారణమా? కార్మిక కుటుంబాలకు తాగునీటి సరఫరాను అడ్డుకునే పరిస్థితి ఎందుకు తలెత్తింది? రిటర్నింగ్ వాల్‌ను మూసివేసింది ఎవరు? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కాలనీలకు ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నారు. భూగర్భ గనుల నుంcr వచ్చే బొగ్గు కలిసిన నీటిని ఫిల్టర్ బెడ్లోని ఇసుక ద్వారా శుద్ధి చేసి కాలనీలకు పంపిస్తారు. ఈ క్రమంలో ఇసుకపై మట్టి పేరుకుపోతుండcgతో ప్రతి రెండు రోజులకు ఒకసారి క్లీనింగ్ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులను కాంట్రాక్టు కార్మికులతో చేయిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా క్లీనింగ్ కార్మికులకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించకపోవడంతో వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఇసుకపై పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులు సక్రమంగా జరగకపోవడంతో నీటి శుద్ధి ప్రక్రియపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిల్టర్ బెడ్లో రిటర్నింగ్ వాల్‌ను మూసివేయడంతో నీటి సరఫరాకు మరింత ఆటంకం ఏర్పడి కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఫిల్టర్ బెడ్‌ను సందర్శించిన డీజీఎం సివిల్
రిటర్నింగ్ వాల్ మూసివేతతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న డీజీఎం సివిల్ రాజేందర్ ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. వాటర్ సప్లై కార్మికులతో రిటర్నింగ్ వాల్ పునరుద్ధరణ పనులు చేయించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి, వాల్‌ను మూసివేసిన పరిస్థితులు, అందుకు బాధ్యులెవరనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆయనతోపాటు ఈ ఈ సుమంత్, సూపర్వైజర్లు శ్రీనివాస్, ప్రభుదాస్ ఉన్నారు
జీతాల వివాదం
కాంట్రాక్టర్ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఒకవైపు సమస్యగా ఉంటే, మరోవైపు కాలనీలకు మంచినీరు అందక కుటుంబాలు ఇబ్బందులు పడటం మరో సమస్యగా మారింది. కాంట్రాక్టర్–కార్మికుల మధ్య వివాదం ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌తోపాటు పర్యవేక్షణాధికారులపైనా ఉంటుంది. అంతేతప్ప, ఆ వివాదం కారణంగా కార్మిక కుటుంబాలు తాగునీటికి దూరం కావడం సమంజసం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏరియా ఉన్నతాధికారులు ఈ ఘటనను సాధారణ సమస్యగా తీసుకోకుండా, మంచినీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

