SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa)కు భారీ షాక్ తగిలింది. స్వదేశంలో గత రెండేళ్లుగా వరస విజయాలతో దూసుకెళ్తున్న సఫారీ జట్టును డర్బన్ టెస్టు (Durban Test)లో చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా.
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa)కు భారీ షాక్ తగిలింది. స్వదేశంలో గత రెండేళ్లుగా వరస విజయాలతో దూసుకెళ్తున్న సఫారీ జట్టును డర్బన్ టెస్టు (Durban Test)లో చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా. నాలుగో ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్(6-49) ఆరు వికెట్లతో విరుచుకుపడగా ఆతిథ్య జట్టు రెండో సెషన్లోనే కుప్పకూలింది. ఎడెన్ మర్క్రమ్ (75) అర్ధశతకంతో పోరాడినా ఓటమి తప్పించలేకపోయాడు. 214 పరుగుల తేడాతో గెలుపొందిన ఆసీస్ బ్యాటుతో ఆసీస్‌ను ఆదుకున్న మ్యాట్ రెన్షా(2-30) బంతితోనూ మెరిశాడు.
డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయంతో మురిసింది. డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా ఓటమన్నదె ఎరుగని దక్షిణాఫ్రికాను ఆసీస్ అలవోకగా ఓడించింది. 421 పరుగుల ఛేదనలో ఎడెన్ మర్క్రమ్(75) ఒంటరి పోరాటం చేసినా హేజిల్‌వుడ్(6-49) ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐదో రోజూ 319 రన్స్ అవసరమవ్వగా.. చేతిలో ఆరు వికెట్లు ఉండడంతో గెలుపుపై ధీమాతో ఉన్న సఫారీల అంచనా తప్పింది.
World. Class. Pace. Bowling.
Josh Hazlewood takes his career-best figures in Tests 👏 https://t.co/B2iLj0e1Qz
— Cricinfo (@cricinfo) October 13, 2026
తొలి సెషన్లోనే మల్డర్(29)ను హేజిల్‌వుడ్ ఔట్ చేయగా రెన్షా ఓవర్లో వెర్రినే వికెట్ ఇచ్చేశాడు. టపటపా రెండు కీలక వికెట్లు పడడంతో మార్కో యాన్సెన్(35) జతగా జట్టును గెలిపించాలనుకున్నాడు మర్క్రమ్. కానీ, విజయం తమకే రాసి పెట్టి ఉంది అన్నట్టు అప్పటికే మూడు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్(5-44) ఒకే ఓవర్లో యాన్సెన్, సైమన్ హార్మర్(0)ను పెవిలియన్ పంపాడు.
చూస్తుండగానే పతనం
మల్డర్ వికెట్‌కు ముందు 155-5తో పటిష్ట స్థితిలోనే ఉన్న సఫారీ జట్టు హేజిల్‌వుడ్ విజృంభణతో 201-8కు పడిపోయింది. అయినా సరే మర్క్రమ్ ఉన్నాడనే ధైర్యంతో ఉన్న ఆతిథ్య జట్టును ఆశ్చర్యపరుస్తూ అతడి వికెట్ తీశాడు స్టార్క్. అంతే.. ప్రొటిస్ జట్టు ఆశలు ఆవిరవ్వగా.. చివరి బ్యాటర్ అన్రిచ్ నోర్జిని ఔట్ చేసిన హేజిల్‌వుడ్ ఆరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 206కే పరిమితమవ్వగా 214 రన్స్ తేడాతో కంగారూ టీమ్ విక్టరీ కొట్టింది.
The Matt Renshaw Test ™️
10 years after his Test debut, 9 years after his first Test hundred, and 3 years after making his Test comeback, he wins his first-ever Player of the Match https://t.co/Dk93hDIVuF
— Cricinfo (@cricinfo) October 13, 2026
డర్బన్ కింగ్స్‌మీడ్ స్టేడియంలో ఆసీస్‌కు వరసగా ఇది నాలుగో గెలుపుకాగా.. సఫారీలను టెస్టు గద విజేతగా నిలిపిన తర్వాత.. ఈ రెండేళ్ల కాలంలో కెప్టెన్ తెంబ బవుమా తొలి ఓటమి చవిచూశాడు. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 18 ఆదివారం రెండో టెస్టు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

