జగిత్యాల టౌన్, మార్చి 19: ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో సత్వర న్యాయం సాధ్యమని హైకోర్టు జడ్జిలు జస్టిస్ నవీన్‌రావు, శమీమ్ అక్తర్ తెలిపారు. శనివారం జగిత్యాల కోర్టులో పర్చువల్ విధానంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును వారు ప్రారంభించగా, జగిత్యాల బార్ అసోసియేషన్ వారి కాసుగంటి లక్ష్మీనర్సింహారావు లైబ్రరీ బిల్డింగ్‌ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్జి ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా జడ్జి మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు వెంటనే శిక్షపడాలంటే పోలీసులు వేగంగా స్పందించాలన్నారు. న్యాయవాదుల కోసం కాసుగంటి లక్ష్మీనర్సింహారావు లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాండ్ర సురేందర్, కార్యదర్శి కే చంద్రమోహన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, అడిషనల్ జడ్జి సుదర్శన్, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాజేశంగౌడ్, కలెక్టర్ జీ రవి, అదనపు ఎస్పీ రూపేశ్, ఆర్డీవో మాధురి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, బార్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తాండ్ర సురేందర్, కార్యదర్శి చంద్రమోహన్ పాల్గొన్నారు.