కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమెతో పాటు పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం సైతం క్వార్టర్స్‌కు ప్రవేశించింది.
ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో సింధు.. 21-8, 21-13తో 8వ సీడ్ మియాజాకి (జపాన్)ను చిత్తుచేసింది. సాత్విక్, చిరాగ్.. 21-18, 21-12తో ప్రపంచ 17వ నెంబర్ జోడీ అరిఫ్, రాయ్ కింగ్ (మలేషియా)ను ఓడించింది. కానీ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది.