న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్‌తో పాటు మీనాక్షి హుడా, హితేశ్ గులియా టైటిల్ పోరు చేరువయ్యారు. మహిళల 48-51కిలోల విభాగంలో నిఖత్ జరీన్ 5-0తో లాల్చెన్బీ చాను తొంగ్రామ్పై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన నిఖత్..ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో టైటిల్‌కు మరింత చేరువైంది. మిగతా క్వార్టర్స్ బౌట్లలో మీనాక్షి 5-0తో కశిష్ మెహతాపై, పవన్ 5-0తో టైసన్‌పై, జాదుమణి 5-0తో నిఖిల్‌పై, సచిన్ 5-0తో కరణ్‌పై, ప్రీతి 5-0తో హర్మీత్కౌర్పై, సాక్షి 4-1తో పూనమ్‌పై, హితేశ్ 5-0తో తేజస్విపై గెలిచి టోర్నీలో ముందంజ వేశారు.