ప్రపంచ దేశాల్లో భారతదేశం గురించి తెలిసినవారు ఇక్కడి వివాహ వ్యవస్థ గొప్పదని చెప్పుకొంటారు. అయితే, ఇక్కడి కుటుంబ జీవితంలో గృహహింస అనేది ఓ వికృత కోణం. ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతో అధికాదాయ దేశాలకు భారత్ నుంచి వలసలు పెరిగాయి. అందులోనూ అమెరికాకు. దీంతో మనవాళ్లతోపాటే గృహహింస కూడా అమెరికాకు దిగుమతైపోయింది. ఫలితంగా.. ముఖ్యంగా మహిళలకు విదేశాల్లో కూడా ఎవరో ఒకరి సాయం తప్పనిసరైంది. ఇలా అగ్రరాజ్యంలో భారతీయ కుటుంబాల్లో గృహహింస నేపథ్యానికి ప్రవాస భారతీయుడు సత్యం మందపాటి ‘ఎక్కవలసిన రైలు’ పేరుతో నవలా రూపమిచ్చారు. ఓ తెలుగు అమ్మాయి అమెరికా యువకుణ్ని పెండ్లి చేసుకుని ఇబ్బందుల పాలవుతుంది.
అలానే అమెరికాలో పుట్టిపెరిగిన మరో అమ్మాయి ఇక్కడి అబ్బాయిని పెండ్లి చేసుకుంటుంది. ఆ అబ్బాయితో సాంస్కృతికంగా ఇమడలేక విడాకులు తీసుకుంటుంది. ఆ తర్వాత తమ జీవితాలను చక్కదిద్దుకునేందుకు ఈ ఇద్దరు అమ్మాయిలూ ఏ మార్గం ఎంచుకుంటారనేది నవల ఇతివృత్తం. ఇక సుదూర తీరాల్లోనూ అవసరంలో, ఆపదల్లో అండగా నిలిచే ఆపద్బాంధవులు ఉంటారని సత్యం మందపాటి ఈ నవల ద్వారా వెల్లడించారు. ఈ నవల చదివితే.. భారతదేశంలోనైనా, అమెరికాలోనైనా.. గృహహింస వికృతత్వానికి అడ్డుకట్ట పడాల్సిందనే నిర్ణయానికి వస్తారు పాఠకులు. ‘ఎక్కవలసిన రైలు’ నవల పాఠకులను ఉత్కంఠగా ఏకబిగిన చదివింపజేస్తుంది. ఆ తర్వాత ఆలోచనలో పడేస్తుంది.
ఎక్కవలసిన రైలు
రచన: సత్యం మందపాటి
పేజీలు: 160, ధర: రూ. 200
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 85588 99478
డా॥ దేవరాజు మహారాజు సప్తతి
పేజీలు: 204,
ధర: రూ. 200
ప్రచురణ:
జీవన ప్రచురణలు
ప్రతులకు: ప్రధాన
పుస్తక కేంద్రాలు
రహదారి (కవితా సంపుటి)
రచన: కొరుప్రోలు హరనాథ్
పేజీలు: 92,
ధర: రూ. 130
ప్రచురణ: హైదరాబాద్
పాతనగర కవుల వేదిక
ప్రతులకు: ఫోన్: 97035 42598
నమః కవి పంచాననాయ
రచన: కపిలవాయి లింగమూర్తి
పేజీలు: 136, ధర: రూ.150 ప్రచురణ: వాణీ ప్రచురణలు
ఫోన్: 87907 27772
…? చింతలపల్లి హర్షవర్ధన్