ధర్మశాల : ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా నేడు డబల్ హైడర్లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వరుసగా గెలిచిన పీబీకేఎస్ ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది ఆ జట్టు. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ వెళ్లాలనే కృత నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ గాయం కారణంగా దూరమవ్వగా వికెట్ కీపర్ జితేష్ శర్మ సారధ్య బాధ్యతలు చేపట్టాడు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w/c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్