Bhagwant Man : పంజాబ్ సీఎం (Punjab CM) భగవంత్ మాన్ (Bhagwanth mann) భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ (Ferozpur) జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను భగవంత్ మాన్ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వరదలవల్ల ప్రభావితమైన బాధితులను పరామర్శించారు. వారి బాధలను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలు వెలిబుచ్చిన ఆవేదన విని ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడ్చేశారు. అందరికీ అండగా ఉంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఏడుస్తూనే ఆమెకు ధైర్యం చెప్పారు.
అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ సంక్షోభంలో ఉన్నా ఆ సంక్షోభం నుంచి బయటపడేవరకు పంజాబ్ అండగా ఉందని, ఇప్పుడు పంజాబ్ సంక్షోభంలో ఉన్నదని, యావత్ భారతదేశం పంజాబ్‌కు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తనతో ఫోన్లో మాట్లాడారని, రాష్ట్రంలో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో వరదల బీభత్సం ఇంకా ఆగలేదని భగవంత్ మాన్ తెలిపారు. ఇంకా పలు ప్రాంతాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్నారు. పంజాబ్‌ను 1888లో భారీ వరదలు ముంచెత్తాయని, ప్రస్తుతం వరద పరిస్థితి అంతకంటే దారుణంగా ఉన్నదని చెప్పారు.
#WATCH | Ferozepur: Punjab CM Bhagwant Mann says, “When the country was in crisis, Punjab always stood with the nation… Today, Punjab is in crisis, and I am fully hopeful that the entire country will stand with Punjab. The Prime Minister and the Home Minister called, and they… https://t.co/k1beED4w8C pic.twitter.com/v6q4AInkYK
— ANI (@ANI) September 2, 2025