Hospital ICU | మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇండోర్ (Indore)లో గల ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు (Rats) స్వైర విహారం చేశాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఇద్దరు నవజాత శిశువులను (Newborns) కొరికాయి. ఎలుకల దాడిలో ఓ చిన్నారి వేళ్లు, మరో శిశువు తల, భుజాలపై గాయాలయ్యాయి.
రాష్ట్రంలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన మహారాజా యశ్వంతరావు చికిత్సాలయంలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారులిద్దరూ వారం వయసుగల వారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ తెలిపారు. ‘ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది గాయపడిన శిశువులను చూసి యాజమాన్యానికి సమాచారం అందించింది. ఆ తర్వాత యూనిట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. నవజాత శిశువుల దగ్గర ఎలుకలు కనిపించాయి. గత 48 గంటల్లో ఓ శిశువు వేళ్లను ఎలుకలు కొరకగా.. మరో శిశువు తల, భుజంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం స్థిరంగా ఉంది’ అని డాక్టర్ అశోక్ యాదవ్ వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
TCS | ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. లేఆఫ్స్ వేళ వేతనాలు పెంచిన టీసీఎస్
PM Modi | చనిపోయిన నా తల్లిని అవమానించారు.. ఆర్జేడీ- కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్
Tesla | భారత విపణిలో టెస్లాకు నిరాశే.. ఆశించిన స్థాయిలో లేని బుకింగ్స్..!