Married Woman | ఓ వివాహిత 17 ఏళ్ల కుర్రాడిపై మనసు పారేసుకుంది. ఇంకేముంది.. తన భర్తను వదిలేసి పిల్లలతో కలిసి ఆ కుర్రాడితో పరారైంది సదరు మహిళ. ఈ ఘటన కేరళలోని అలప్పుజాలో చోటు చేసుకుంది.
కేరళలోని అలప్పుజాకు చెందిన 27 ఏండ్ల మహిళకు కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొద్ది కాలం క్రితం ఆమెకు 17 ఏండ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ బాలుడిపై ఆమె మనసు పారేసుకుంది. దీంతో ఆ బాలుడికి మాయమాటలు చెప్పి రెండు వారాల క్రితం అలప్పుజా నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని కొల్లూరుకు చేరుకుంది.
ఇక బాలుడు కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహిత మొబైల్ వినియోగించకపోవడంతో.. ఆమె ఎక్కడుందనే విషయాన్ని పోలీసులు కనుగోలేకపోయారు. అయితే పరారైన 12 రోజుల తర్వాత తాము బెంగళూరులో ఉన్నామని బంధువులకు మహిళ సందేశం పంపింది. దీంతో పోలీసులు ఆమె ఆచూకీని తెలుసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, తనకు భర్త ఇష్టం లేడని తేల్చిచెప్పింది. ఈ యువకుడితోనే ఉంటానని, పిల్లలు కూడా తన వద్దే ఉంటారని పోలీసులకు తెలిపింది. అయితే ఆ అబ్బాయిని బలవంతంగా తన వెంట తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తానికి వీరిద్దరిని సోమవారం అలప్పుజాకు తీసుకొచ్చారు. మహిళపై పోక్సో కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. అలప్పుజా నుంచి బెంగళూరుకు వచ్చిన తర్వాత బాలుడిని లైంగికంగా ప్రేరేపించిందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉందన్నారు పోలీసులు.