హుజూరాబాద్ : గత 60 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయనటువంటిది మా కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి కుటుంబానికి పదిలక్షలు ఇచ్చి మమ్ములను ఒక ఉన్నతస్థాయిలో చూడాలనే ఆశతోని ఉన్నరు. కాబట్టి ఈ రోజు మా గ్రామం ఏకగ్రీవంగా టీఆర్ఎస్కు ఓటు వేయాలని ఏకతాటిపై నిలబడ్డం. ఈటెల రాజేందర్‌కు 20 సంవత్సరాలు అవకాశం ఇచ్చినం. ఈరోజు బీజేపీలకు పోయి నాకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ మీద నిందలు ఏస్తున్నడు.
ఈ రోజు ఈటెల రాజేందర్ ఎవరు? 2001లో ఈటల ఎక్కడున్నడు. 2004లో కేసీఆర్ దయతో టికెట్ తెచ్చుకుని ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిండు. బీసీ నాయకున్ని అంత గొప్పస్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. ఇవాళ వేలకోట్లు సంపాదించు కున్నది కేసీఆర్ వల్లనే కదా! ఈ రోజు నీవు బీసీ నాయకున్ని అని చెప్పుకుంటు..నీకు బీసీ అల్లుడు దొరకలేదు, బీసీ కోడలు దొరకలేదా?
బీసీని ఇడిసిపెట్టి రెడ్డి కోడలు, అల్లుణ్ణి చేసుకున్నవు. నీవు సిద్ధిపేట దాటెంతవరకు బీసీ నాయకునివి. సిద్ధిపేట దాటంగానే రెడ్డి బిడ్డవా? ఎన్నికల కమిషన్‌కు దళితబంధు ఆపివేయాలని ఈటల లేఖ రాయడాన్ని ఖండిస్తున్నాం. నీవు చేసింది కరెక్ట్ కాదు.
–దాసారపు సతీశ్, నర్సింగాపూర్ గ్రామం, వీణవంక మండలం
దళితబంధు ప్రవేశపెట్టిన కేసీఆర్ కే నాఓటు
కేసీఆర్ దళితబంధు పెట్టిండు. దానితోని మేము బాగుపడుతానం. కేసీఆర్ కే ఓటు వేస్తా.
– దాసారపు పోచయ్య నర్సింగాపూర్ గ్రామం వీణవంక మండలం