గద్వాల, డిసెంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు.. మొన్నటి వరకు యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వే శారు. అయితే అంచనాకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయడంలో మాత్రం ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపించారు. సోమవారం గద్వాల పీఏసీసీఎస్కు 450 బస్తాల యూరియా రాగా విషయం తెలుసుకొన్న రైతులు తెల్లవారుజామున 150 మందికిపైగా రైతులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు ఐదారు గంటలు బా రులు తీరారు. పాస్బుక్కుపై ఎకరాకు రెండు, మూడు యూరియా బస్తాలను సిబ్బంది పంపిణీ చేశారు. దీంతో 100 మందికిపైగా రైతులకు యూరియా అందగా.. మిగితా వారు నిరాశతో అక్కడి నుంచి వెనుతిరిగారు. ప్రస్తుతం ఉన్న రైతులకే యూరియాను సరఫరా చేయలేని ప్రభుత్వం యాప్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పడం చూస్తుంటే రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక ఈ యాప్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. యూరియా కోసం వచ్చిన కొందరి రైతులకే టోకెన్లు దొరకడం.. మిగతా వారికి దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వానకాలం సీజన్లో రైతన్నలు యూరియా కోసం ఆందోళనలు చేసినా సరిపడా అందించడంలో ప్రభు త్వం విఫలమైంది. కనీసం యాసంగిలో అయినా కష్టాలు తప్పుతాయని భావించినా మళ్లీ నిరాశే మిగిలింది. అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకటి, రెండు బ్యాగుల యూరియా కోసం రైతులు తెల్లవారు జాము నుంచే పనులు వదులుకొని క్యూలో నిలబడుతున్నారు. రైతు భరోసా ఎలా గో రాలేదు.. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే యూరియానైనా సరిపడా ఇస్తుందా? అంటే అదీ లేదని వాపోతున్నారు. గద్వాల జిల్లాలో జూరాల, నెట్టెంపాడ్తోపాటు బోరు బావుల కింద రైతులు పెద్ద మొత్తంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.