పెద్దమందడి : సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకు అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులను( BRS Leaders) అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన (Protest ) చేపట్టారు. పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి గ్రామానికి చెందిన సురేష్ కుమార్,కొండన్నను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్కు(Police station) చేరుకొని ధర్నా నిర్వహించారు.
నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినంతా మాత్రన అరెస్టు చేయడం తగదని అన్నారు. పోలీసులు కాంగ్రెస్నాయకుల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాను తప్పుగా వాడుకుంటే వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు బీఆర్ఎస్ భయపడేదే లేదని అన్నారు. కార్యక్రమంలో పెద్దమందడి గ్రామ అధ్యక్షులు సేనాపతి, సింగిరెడ్డి కురుమూర్తి, పురుషోత్తం రెడ్డి, సంజీవరెడ్డి, రాజు, వెంకట్ రెడ్డి ఉన్నారు.