వలిగొండ, ఫిబ్రవరి24: రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్‌ను తొలగించి పాత పద్ధతిలోనే రైతులకు తగిన మొత్తంలో యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు మంగళవారం వలిగొండ మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు యూరియాను అం దించడం చేతకాక యాప్ పేరుతో రైతులను నట్టేట ముంచిందన్నారు. షాపుల్లోలేని యూరియా కోసం యా పుల్లో రైతులను వెతుక్కోమని చెబుతూ.. అన్నంపెట్టే రైతన్నకు సున్నం పెడుతోందన్నారు.
ఇప్పటికైనా ప్రభు త్వం యాప్‌ను తొలగించి డీలర్ల ద్వారా, పీఏసీఎస్ కేం ద్రాల ద్వారా అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. రాస్తా రోకోతో భువనగిరి-చి ట్యాల ప్రధాన రహదారికిరువైపులా కిలోమీ టర్ల మేర వాహనాలు నిలిచిపోయా యి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ముద్దసాని కిరణ్‌రెడ్డి, పనుమటి మమతానరేందర్‌రెడ్డి, మద్దెల మం జుల, పల్సం రమేశ్, జానీ అఫ్రోజ్, సర్పంచ్‌లు ఆవుల నరసింహ, బొగిగె లింగస్వామి, జడిగె భిక్షపతి, మాసంపల్లి తిరుమలేశ్, నాయకులు సోలిపురం జనార్దన్‌రెడ్డి, తాడూరి లింగస్వామి, మోటె లింగస్వామి, మద్దెల సం దీప్‌కుమార్, కీసరి రాంరెడ్డి, పోలేపాక సత్యనారాయణ, బల్గూరి నరేస్ రెడ్డి, పల్సం రాజు పాల్గొన్నారు.
పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి
ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 24: ప్రభుత్వం యూరియా కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతి ద్వారానే యూరియాను అందివ్వాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు యాస ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..యూరియా కోసం మండలంలోని అన్ని గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఒకవేళ పీఏసీఎస్‌తో పాటు, ప్రైవేట్ ఎరువుల దుకాణాలకు యూరియా వచ్చినా రెండు నిమిషాల్లోనే అయిపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే యూరియాను అందించి ఆదుకోవాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, మండల సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్ గౌడ్, జిల్లా నాయకులు కోరె భిక్షపతి, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, కొరటికల్ మాజీ సర్పంచ్ కోలా సత్తయ్య గౌడ్, తిరుమల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగరాజు, మల్లికార్జున్, సత్తయ్య, వార్డు సభ్యులు సతీస్ష్, విశాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.