హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ అనుబంధ బీఫార్మసీ కాలేజీల్లో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫార్మసీ విద్యార్థులను డిసెంబర్ 2025 సర్క్యులర్ పేరుతో డిటెయిన్ చేయడం బాధాకరమని జేఎన్టీయూ స్టూడెం ట్స్ప్రొటెక్షన్ ఫోరం(జేపీఎఫ్) విద్యార్థులు వాపోయారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. బీఫార్మసీ విద్యార్థులకు సెకండియర్, థర్డ్ ఇయర్ వరకు ఎలాంటి నిబంధనలు వర్తించాయో, వాటినే ప్రస్తుతం కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పాత నిబంధనల ప్రకారం సెకండియర్ నుంచి థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్‌కు ప్రమోట్ చేయాలని కోరారు.