సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు అనారోగ్యంతో ఎల్లయ్య మృతి చెందారు. బిహెచ్ఎల్ పరిశ్రమ కార్మిక సంఘం సీనియర్ నాయకుడు ఎల్లయ్య అకాల మరణం పట్ల పఠాన్ చెరు పారిశ్రమిక వాడ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ పరిశ్రమతో పాటు వివిధ పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎల్లయ్య కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్మిక రంగంలో తనదైన పాత్ర పోషించిన ఎల్లయ్య మరణం కార్మిక రంగానికి తీరనిలోటని కార్మిక సంఘాలు, బీహెచ్ఈఎల్ కార్మికులు తెలిపారు. ఎల్లయ్య మృతి పట్ల సానుభూతి తెలియజేశారు.