Gloria Steinem | అమెరికాలో ఫెమినిస్ట్‌గా పేరుగాంచిన ప్రముఖ రచయిత్రి గ్లోరియా స్టీనెమ్ 92 ఏండ్ల వయసులో న్యూయార్క్‌లోని తన నివాసంలో బుధవారం మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫాలోవర్లు, అభిమానులు వెల్లడించారు. ఈమె స్త్రీ స్వేచ్ఛ కోసం, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. దీనికోసం ఉమెన్స్ యాక్షన్ అలయన్స్ అనే సంస్థను స్థాపించారు. గ్లోరియా 1972లో మిస్ మ్యాగజీన్ (Ms Magazine)ను సహ వ్యవస్థాపకురాలిగా ప్రారంభించారు. ఈ మ్యాగజీన్ అమెరికాలో మొదటి ఫెమినిస్ట్ పత్రికగా నిలిచింది. ఇది మహిళల యాజమాన్యంలో, మహిళల కోసం నడిచిన తొలి పత్రిక.
మహిళల హక్కులు, సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ కోసం ఆమె జీవితాంతం పోరాడారు. మహిళల పునరుత్పత్తి హక్కులపై పోరాడినవారిలో గ్లోరియా ప్రముఖంగా నిలిచారు. గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కు అని 1973లో రో వర్పెస్ వేడ్ (Roe v Wade) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆమె స్వాగతించారు. మహిళల కోసం చేసిన కృషికి ఆమె 2013లో అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను బరాక్ ఒబామా చేతుల మీదుగా అందుకున్నారు.