హైదరాబాద్ : కాంగ్రెస్‌పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. తన కుమారుడి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమె ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో టెస్టులు చేయించనున్నారు. నాలుగేళ్ల క్రితం విపరీతమైన తలనొప్పి రావడంతో అప్పట్లోనూ ఓ సారి ఆమె ఎల్వీ ప్రసాద్‌కు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మళ్లీ ఆ నొప్పి వేధిస్తుండడంతో ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంకాగాంధీ రాకను ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. గతంలోనూ ఎవరికీ తెలియకుండానే ఆసుపత్రి వర్గాలు పరీక్షలు చేశారు. ప్రియాంక గాంధీ సూచనతోనే విజిట్విషయాలను వెల్లడించడం లేదని ఆసుపత్రిలోని ఓ వైద్యుడు చెప్పారు. మరోవైపు ఆమె రాక కాంగ్రెస్‌పార్టీ ముఖ్యులకు తప్ప, మరెవరికీ తెలియదు. వ్యక్తిగత కారణాలతో వస్తున్నందున పార్టీ నుంచి కూడా స్వాగత కార్యక్రమాలు ఏవీ ఉండవని తెలుస్తున్నది.