ఇంద్రవెల్లి, జూలై 31: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో గోరింటాకు వంటి సాంప్రదాయ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు. శుక్రవారం ముత్నూర్లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
గోరింటాకు వేడుకల సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ మాట్లాడుతూ… విద్యార్థినులు చదువుతో పాటు భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలుసుకుని వాటిని ఆచరించాలని సూచించారు. సంస్కృతిని ప్రతిబించించే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినుల్లో ఐక్యత, పరస్పర గౌరవం, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ప్రిన్సిపాల్ చెప్పారు. అనంతరం విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టించుకుని ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం రంగురంగుల అలంకరణలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ సంగీత, భార్గవి, అధ్యాపక బృందం మాధవి, అరుణ, పీడీ సౌమ్య, పీఈటీ లక్ష్మీ, ప్రియాంక, కృష్ణవేణి, పూజ, ఛాయా, జీఎన్ఎం సంధ్యా, రత్నమాల, రజిత, నాగమ్మ, గౌతమీ, నిరోజా, రాధా, ఆరాధన, కాత్లే లలిత, సంజీత, జ్యోతి, లలితతో పాటు కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.