హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ర్టానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడప నున్నారు. 20న బొల్లారంలోని రాష్ట్రప తి భవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.