అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో జిల్లాలో సంబురాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధమవుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అంబరాన్నంటేలా సంబురాలు జరుపాలని నిర్ణయించారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఆదివారం సంబురాలు ప్రారంభించి మూడు రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు.
వరంగల్, మార్చి 4(నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో సంబురాలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. 6న సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టడం, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం స హాయక సంఘాల నాయకులను సన్మానించడం, కేసీఆర్ కి ట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు జరుపనున్నట్లు చెప్పారు. 7న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను వారి ఇండ్లకు వెళ్లి కలవడం, వారితో సెల్ఫీలు తీసుకోవడం, 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు, సంబురాలు జరుపనున్నట్లు వెల్లడించారు. నర్సంపేటలో శనివారం నుంచే మహిళా క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. వారం రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవాల్లో నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల మహిళలు పాల్గొంటారని తెలిపారు. శనివారం ఉదయం 10గంటలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఈ క్రీడోత్సవాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. శుక్రవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో జడ్పీలో ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మహిళలతో సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతి భ కనబర్చిన మహిళలను పెద్ది స్వప్న సన్మానించారు.
వరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నిర్వహించిన సమావేశానికి పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనేతలు, శ్రేణులతో పాటు మహిళా నాయకురాళ్లు, ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు వరంగల్‌తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వేడుకలు జరుపనున్నట్లు ప్రకటించారు. అన్ని డివిజన్లలో క్రీడా పోటీలు, సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు నరేందర్ తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో మూడురోజుల పాటు జరిగే సంబురాల్లో నియోజకవర్గంలోని మహిళలందరూ సంతోషంగా పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.
మూడు రోజుల పాటు జరిగే కేసీఆర్ మహిళా బంధు సంబురాలను ఆదివారం ఉదయం జిల్లాలో ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 6వ తేదీన ఇప్పటివరకు కేసీఆర్ కిట్టు ద్వారా సుమారు 11 లక్షల మందికి రూ.1,700 కోట్ల లబ్ధి చేకూరిందని, కల్యాణలక్ష్మి ప థకం ద్వారా 10లక్షల30వేల మందికి రూ.9,022 కోట్లను ప్రభుత్వం పెళ్లి కానుకగా అందించిన శుభ సందర్భంలో సీ ఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీ కట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేరోజు పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకులు, ఇతర మహిళలకు గౌరవ పూర్వక సన్మానం, కేసీఆర్ కిట్టు, షాదీముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 7న మహిళా సంక్షేమ కార్యక్రమాలైన కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటి వద్దకు వెళ్లి కలవడం, వారితో సెల్ఫీలు తీసుకోనున్నట్లు తెలిపారు. 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపనున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అరూరి పిలుపునిచ్చారు.