రాయ్పూర్ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూ విధించాయి. కరోనా వైరస్ మన దేశంలో ప్రబలడం మొదలైన నాటి నుంచి కరోనా వారియర్స్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇదే కోవలో ఓ మహిళా డీఎస్పీ.. గర్భంతో ఉన్నా మండుటెండలోనూ కరోనా విధులను నిర్వహిస్తున్నారు.
ఆమే.. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ దంతేవాడ డివిజన్ డీఎస్పీ శిల్పా సాహు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు వహించాలని సీనియర్ సిటిజన్లు, మహిళలను చైతన్యపరిచే విధులను నిర్వర్తిస్తున్నారు. ఇది కామనే కావొచ్చు కానీ.. సదరు యువ డీఎస్పీ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూసేందుకు మండుటెండల్లో సైతం డ్యూటీ చేస్తున్నారు.
శిల్పా సాహు విధులు నిర్వర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఆమె.. కర్ర చేత పట్టుకుని వచ్చిపోయే వాహనదారులను నిలిపి కరోనా మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు. ఫ్రంట్లైన్ కార్మికులు ప్రతిరోజూ తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టి ప్రజలను రక్షిస్తున్నారో తెలిపేందుకు ఈ వీడియో ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
#FrontlineWarrior DSP Shilpa Sahu is posted in #Maoist affected Bastar's Dantewada.The police officer who is pregnant is busy on the streets under scorching sun appealing people to follow the #lockdown. Let's salute her and follow #COVID19 protocol #SocialDistancing #MaskUpIndia pic.twitter.com/UHnSLYfKaI
— Aashish (@Ashi_IndiaToday) April 20, 2021
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..