ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. కాగా సదరు జీవో కాపీని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (తుంటియా) నాయకులకు అందజేశారు.ఈ సందర్భంగా తుంటియా అధ్యక్షుడు ఖదీర్‌ఖాన్ మాట్లాడుతూ తమకు పీఆర్సీ అమలు చేస్తూ జీవో విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
దీనికి సహకరించిన ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేశ్, క్రాంతి కిరణ్, పద్మారావు, టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్‌లకు పదమూడు వర్సిటీల బోధనేతర సిబ్బంది తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంటియా నాయకులు మహిపాల్‌రెడ్డి, అమృత్‌రెడ్డి, ఎల్లయ్య, శివశంకర్, ప్రవీణ్‌కుమార్, తిరుపతి, యూనుస్, సతీశ్‌బాబు, ప్రభాకర్, కృష్ణవేణి, అబ్దుల్ షుకూర్, సాంబశివుడు, ప్రభాకర్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.