బేల, జూలై 1: అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత అడ్డిభోజ రెడ్డి నీకు లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అదిలాబాద్ నియోజక వర్గ అభివృద్ధి కోసం దాదాపు 6 వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసిన విషయం నీకు తెలియదా అని ప్రశ్నించారు. మంగళవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి మీరు నిన్న విలేకరుల సమావేశం లో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఏం అభివృద్ధి జరుగా లేదు అన్నారు కదా.. అదిలాబాద్ నియోజక వర్గంలో దాదాపు రూ. 6 వేల కోట్లతో అభివృద్ధికి సంబంధించి వివరాలు కావాలంటే ఆధారలతో సహా చూపిస్తా అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే రండి మీకు అదిలాబాద్ అభివృద్ధి గురించి వివారిస్తం అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గొప్పలు చెప్పిన నువ్వు ఇప్పుడు విమర్శిస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నది మీ పార్టీ కాదా అని సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడే కదా ఇంక రుణ మాఫీ పూర్తి కాలేదని మీడియా ముందు చెప్పారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, మాస్క్ తేజిరావ్, దేవన్న, మంగేష్ ఠాక్రే, బత్తుల సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.