Prachi Tehlan | రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ నటించిన త్రిశంకు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఢిల్లీ భామ ప్రాచీ టెహ్లాన్ (Prachi Tehlan). భారత మాజీ నెట్‌బాల్, బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తోన్న రామ్ (Ram)లో కీలక పాత్రలో నటిస్తోంది ప్రాచీ టెహ్లాన్. చాలా రోజుల తర్వాత ప్రాచీ టెహ్లాన్ ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో వార్తల్లో నిలిచింది.
యూట్యూబ్‌లో సినిమా పాటలతోపాటు ప్రైవేట్ సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటాయని తెలిసిందే. ఇటీవలే మ్యూజిక్ వీడియోతో అందరినీ పలుకరించింది ప్రాచీ టెహ్లాన్. తేనెలా వానలా అంటూ సాగే ప్రైవేట్ సాంగ్‌లో అందాలు ఆరబోస్తూ యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మ్యూజిక్ లవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది. నిఖిల్ మలియక్కల్, ప్రాచీ టెహ్లాన్ నటించిన ఈ మ్యూజిక్ వీడియోకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించాడు. వీహ ఈ పాటను పాడింది.
యశ్వంత్ కుమార్ జీవకుంట్ల కొరియోగ్రఫీ చేయగా.. పాలచర్ల సాయి కిరణ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశాడు. సెలయేళ్లు, పచ్చిక బయళ్ల అందాలు, మరోవైపు ప్రాచీ టెహ్లాన్ సోయగాలు, అద్బుతమైన సంగీతం మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?