power holiday in Gujarat బీజేపీ నేతలు మాట్లాడితే.. గుజరాత్.. గుజరాత్ మోడల్… గుజరాత్ మోడల్ అంటూ తెగ గొప్పలకు పోతుంటారు. ఏది మాట్లాడినా.. గుజరాత్‌కు లంకె పెడుతుంటారు. గుజరాత్ ప్రపంచంలోనే గొప్ప మోడల్ అని ప్రజల చెవులను తెగ ఊదరగొడుతుంటారు. అంతటి ఘనత వహించిన గుజరాత్లో, సాక్షాత్తూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పవర్ హాలిడే ప్రకటించింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. వారానికి ఒక రోజు పవర్ హాలిడే అని సంచలన ప్రకటన చేసింది.
వారానికో రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే ఉంటుందని గుజరాత్ సర్కార్ తెలిపింది. వారానికో రోజు పరిశ్రమలన్నీ కచ్చితంగా సెలవులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అన్ని జిల్లాలకూ పవర్ హాలిడే ఒకే రోజు వుండదని, ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు వుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.