Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Power Cuts |కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిర్వహించిన సమావేశానికి కరెంటు కటకట ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని అనేకచోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు, సబ్స్టేషన్ల ముట్టడి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి సాక్షాత్తూ కాంగ్రెస్ మీటింగ్‌కే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
Power Cuts | ఖమ్మం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిర్వహించిన సమావేశానికి కరెంటు కటకట ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని అనేకచోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు, సబ్స్టేషన్ల ముట్టడి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి సాక్షాత్తూ కాంగ్రెస్ మీటింగ్‌కే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని పార్టీ శ్రేణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వేదికపై సాక్షాత్తు విద్యుత్తు శాఖ మంత్రి మల్లు విక్రమార్క ఉండగా.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రసంగిస్తుండగానే ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణుల్లో ఇవేమి కరెంటు కోతలంటూ తీవ్ర అసహనం వ్యక్తమైంది. కొద్ది నిమిషాలకు కరెంట్ రావడంతో పొంగులేటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

