Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో రైలు పట్టాల వద్ద అసోం యువతి హిమశ్రీ మృతదేహం లభించినచోట పోలీసులు మరో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Assam Girl | డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖపట్నానికి వచ్చిన అసోం యువతి హిమశ్రీ బోరా రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఊహించని మలుపు చోటుచేసుకుంది. హిమశ్రీ బోరా మృతదేహం దొరికిన చోట మరో మృతదేహం ఉండటం కలకలం రేపుతోంది.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో రైలు పట్టాల వద్ద అసోం యువతి హిమశ్రీ మృతదేహం లభించినచోట పోలీసులు మరో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్2 కోచ్‌లో ఎక్కినట్టు గుర్తింపు..
స్నేహితులతో కలిసి విశాఖపట్నానికి వచ్చిన హిమశ్రీ బోరా బ్యాంకు కాంపిటేషన్ పరీక్ష రాసేందుకుగానూ సొంతూరుకు ఒంటరిగా బయలుదేరింది. ఈ నెల 6న రైలు ఎక్కింది. కోచ్‌లో పలువురు పురుషులు తాగి ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పింది. తాగి ఉన్న వారిపై ‘రైల్ మదత్ పోర్టల్’లో ఫిర్యాదు చేసింది.
స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు హిమ శ్రీ బోరా కోసం వెతకగా కనిపించలేదు. ఈ క్రమంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఎస్2 కోచ్‌లో ఎక్కినట్టు గుర్తించారు. పోలీసులు యువతి కోసం గాలించగా ఆముదాలవలస-పొందూరు స్టేషన్ల మధ్య డెడ్‌బాడీని గుర్తించారు.
హిమశ్రీ మృతదేహం దొరికిన చోట మరో మృతదేహం కలకలం
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో రైలు పట్టాల వద్ద అస్సాం యువతి హిమశ్రీ మృతదేహం లభించినచోట మరో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు https://t.co/fUSs5iCKdq
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

